ఆ స్కూల్‌లో వారానికి ఒకే క్లాస్..!

ఆ స్కూల్‌లో వారానికి ఒకే క్లాస్..!

ADB: బేల మండలంలోని ఖడ్కి పాఠశాల ఉపాధ్యాయుడు వారానికి ఒక్కసారి మాత్రమే వచ్చి హజరు సంతకం పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. దీంతో విద్యార్థుల చదువు దెబ్బ తింటుందని పిల్లల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన స్థానంలో ఓ యువకుడిని రూ. 8 వేల జీతం ఇస్తూ ప్రైవేట్ వాలంటీర్‌గా నియమించుకున్నాడు. పాఠశాలకు ఏ అధికారులు రారన్నా ధీమాతో ఈ విధంగా చేస్తున్నాడని స్థానికులు తెలిపారు.