వార్డులలో ఎమ్మెల్యే పర్యటన
పార్వతీపురం మున్సిపాలిటీలో అన్ని సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. శుక్రవారం 22వ వార్డులో ప్రతి ఇంటిని పరిశీలించారు. ప్రజలను ఆప్యాయంగా పలరించి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. ఈమేరకు కాలువలు, పారిశుధ్యం, తాగునీరు వాటిపై ఎమ్మెల్యే దృష్టికి ప్రజలు తీసుకువెళ్లారు.