జిల్లాలో 11 బార్లకు దరఖాస్తులు ఆహ్వానం

కోనసీమ: జిల్లాలో 11 బార్‌లు పెట్టుకునేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఎక్సైజ్ సూపరెంటెండెంట్ ప్రసాద్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ జనరల్ కేటగిరిలో 9, గీత కార్మికులకు 2 కేటాయించమని తెలిపారు. దరఖాస్తు తో పాటు రూ.5 లక్షలు ఫీజు చెల్లించవలసి ఉంటుందన్నారు. మద్యం అమ్మకాలకు బార్లలో రాత్రి 12 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.