ఆర్బీఐ భారీ ల్యాండ్ డీల్
ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి రిజర్వ్ బ్యాంక్ 4.61 ఎకరాల భూమి కొనుగోలు చేసింది. ఈ లావాదేవీ ఈ ఏడాది దేశంలో అతిపెద్ద భూలావాదేవీగా నిలిచింది. దక్షిణ ముంబైలోని నారీమన్ పాయింట్ వద్ద ఈ భూమికి సమీపంలోనే బాంబే హైకోర్టు, మంత్రాలయ వంటి వీవీఐపీ భవనాలు ఉన్నాయి.