సర్పంచ్ దీప్తి రాజు మృతి

సర్పంచ్ దీప్తి రాజు మృతి

చిత్తూరు: విజయపురం మండలం ఇళత్తూరు గ్రామ సర్పంచి దీప్తి ఆదివారం ఉదయం మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తిరుపతిలోని సిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు స్థానికులు తెలిపారు. ఆమె మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పలువురు దీప్తి సర్పంచిగా అందించిన సేవలను కొనియాడారు.