వాహనంపై నుంచి జారిపడి వ్యక్తి మృతి

ప్రకాశం: డీజే వాహనం నుంచి జారిపడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన కనిగిరి మండలం గొల్లపల్లిలో జరిగింది. చిన్న ఇర్లపాడుకు చెందిన మహేష్(18) డీజే ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి ఓ కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా గొల్లపల్లి వద్ద వాహనం నుంచి జారిపడటంతో మహేష్ తలకు తీవ్ర గాయమై అక్కడక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాల తెలియాల్సి ఉంది.