బొప్పాయి తోటకు తీవ్ర నష్టం
AKP: పాయకరావుపేట మండలం అరట్లకోటలో బుధవారం సాయంత్రం పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. ఈ గాలుల ధాటికి రైతు గర్లంక నాగేష్ సాగు చేసిన బొప్పాయి తోట పూర్తిగా నేలమట్టమైంది. సుమారు 35 సెంట్ల భూమిలో సాగు చేసిన ఈ తోట కోసం రూ. 50,000 వరకు పెట్టుబడి పెట్టినట్లు బాధితుడు వాపోయాడు. చేతికొచ్చే సమయంలో పంట నాశనం కావడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.