డ్రైనేజీ మరమ్మతులను పరిశీలించిన ఎమ్మెల్యే

డ్రైనేజీ మరమ్మతులను పరిశీలించిన ఎమ్మెల్యే

ATP: తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి బుధవారం పట్టణంలోని రజక కళ్యాణ మండపం సమీపంలో జరుగుతున్న డ్రైనేజీ పైప్‌లైన్‌ మరమ్మత్తు పనులను ఆకస్మికంగా పరిశీలించారు. పనుల పురోగతిని, నాణ్యతను ఆయన స్వయంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మరమ్మత్తు పనుల్లో వేగం పెంచాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని మున్సిపల్ అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.