ముదిరాజ్ సంఘం నాయకుల ముందస్తు అరెస్టు
NGKL: రాష్ట్ర ముదిరాజ్ మహాసభ పిలుపునిచ్చిన 'రాజభవన్ ముట్టడి' పిలుపు నేపథ్యంలో లింగాల పోలీసులు ఇవాళ ముదిరాజ్ సంఘం నాయకులను ముందస్తు అరెస్టులు చేపట్టారు. మండల అధ్యక్షుడు కొండమోని సత్యం, ప్రధాన కార్యదర్శి గడ్డిపోగుల శివ సహా పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాంతిభద్రతల దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.