ఆగిపోయిన బస్సు.. ప్రయాణికుల ఆగ్రహం

ఆగిపోయిన బస్సు.. ప్రయాణికుల ఆగ్రహం

KDP: పులివెందుల నుంచి కర్నూలుకు బయల్దేరిన ఆర్టీసీ బస్సు ముద్దనూరు ఘాట్ రోడ్డులో సోమవారం ఆగిపోయింది. ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దూర ప్రాంతాలకు పాత బస్సులు కేటాయించడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి దూర ప్రాంతాలకు మంచి కండీషన్ ఉన్న బస్సులను నడపాలని కోరుతున్నారు.