రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన ఎస్సై
కృష్ణా: నందివాడ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్సై శ్రీనివాస్ రౌడీషీటర్లకు నిన్న కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ.. ప్రజలకు హాని కలిగించే, సామాజిక శాంతి భద్రతకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమాజంలో మార్పు కోసం ప్రతి ఒక్కరూ మంచి మార్గాన్ని ఎంచుకోవాలని, కుటుంబ సభ్యుల భవిష్యత్తు కోసం చెడు పనులను దూరంగా ఉండాలన్నారు.