వైసీపీ బీసీ విభాగ పదవి దక్కించుకున్న సత్యగిరి
E.G: రాజమహేంద్రవరం అసెంబ్లీ పరిధిలోని ధవళేశ్వరం గ్రామానికి చెందిన డా. చొల్లంగి సత్యగిరి YSRCP జిల్లా బీసీ విభాగ ప్రధానకార్యదర్శిగా నియమితులయ్యారు. ఈమేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది. బాధ్యతలు అప్పగించిన జిల్లా అధ్యక్షుడు చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణకు సత్యగిరి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలపరిచేందుకు కృషి చేస్తానన్నారు.