శ్రీ సంతోషీమాత ఆలయ అర్చకుడు తొలగింపు
VZM: స్థానిక మయూరీ జంక్షన్ వద్దనున్న శ్రీ సంతోషీమాత ఆలయ అర్చకుడు రమేష్ పై ఆరోపణలు రావడంతో ఎలైడ్ హౌసింగ్ సొసైటీ ఆయనను విధుల నుంచి తొలగించింది. ఏడాదిన్నరగా ఫిర్యాదులు అందుతున్నాయని, హెచ్చరించినా మార్పు రాకపోవడంతో ఎస్పీకి విన్నవించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సొసైటీ అధ్యక్షుడు లక్ష్మిమల్లిక్ తెలిపారు. అయితే, ఈ ఆరోపణలను అర్చకుడు రమేష్ తివారీ ఖండించారు.