అది రాజ్యాంగం వల్లే సాధ్యం: చంద్రబాబు
AP: చాయ్‌వాలా ప్రధాని అయ్యారంటే రాజ్యాంగం వల్లేనని సీఎం చంద్రబాబు అన్నారు. మంగళగిరిలోని ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. '2014లో 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న మనం ఇప్పుడు నాలుగో ఆర్థిక వ్యవస్థకు చేరాం. వచ్చే ఏడాది భారత్ ప్రపంచంలో మూడో, 2038 నాటికి రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కాబోతోంది. 2047 నాటికి భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్నది లక్ష్యం' అని పేర్కొన్నారు.