పొన్నూరులో సీసీ డ్రైన్ల నిర్మాణానికి శంకుస్థాపన

పొన్నూరులో సీసీ డ్రైన్ల నిర్మాణానికి శంకుస్థాపన

GNTR: పరిసరాలను ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని MLA ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు. శనివారం పొన్నూరులోని 3వ వార్డు సిద్ధివినాయకనగర్‌లో రూ.16 లక్షల డ్రైన్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అదే విధంగా 31వ వార్డు తెలగపాలెంలో రూ.8.40 లక్షలతో నిర్మించనున్న మరో డ్రైన్ నిర్మాణానికి కూడా ఆయన శంకుస్థాపన చేశారు.