అలర్ట్.. కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు

అలర్ట్.. కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు

TG: HYDలోని KBR పార్క్ చుట్టూ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉ.11 నుంచి మ. ఒంటి గంట వరకు వన్ వే నిబంధనలను అమలు చేయనున్నారు. స్టీల్ బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. పంజాగుట్ట- మాదాపూర్ వెళ్లే వాహనాలు.. రోడ్ నెం. 5 మీదుగా మళ్లించనున్నారు. రోడ్ నెం.45 నుంచి పంజాగుట్ట వెళ్లే వాహనాలను జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు మీదుగా పంపించనున్నారు.