'జాబ్ కార్డు ఉన్న రైతులందరికీ పంపిణీ చేయాలి'

ASR: జాబ్ కార్డు కలిగి ఉన్న రైతులందరికీ ఉచితంగా మొక్కలు పంపిణీ చేయాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆదేశించారు. బుధవారం అరకులోయలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అరకు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో పనిచేస్తున్న ఉపాధి హామీ పథకం ఏపీవోలతో సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పథకం ద్వారా రైతులు పండ్ల మొక్కలు పెంపకం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.