VIDEO: పాకాలలో ఘోర రోడ్డు ప్రమాదం

TPT: పాకాల మండలంలో తోటపల్లి వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఐదుగురు చనిపోగా పలువురు గాయపడ్డారు. తిరుపతి నుంచి చిత్తూరు వైపు వెళ్తున్న కారు మొత్తం కంటైనర్ కిందకు దూసుకెళ్లడంతో మృతదేహాలు ఛిద్రమయ్యాయి. గాయపడిన వారి ఆర్తనాదాలు, రక్తం మరకలతో ఘటనా స్థలం భీతావహంగా మారింది. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, 9 ఏళ్ల బాబు ఉన్నారు.