రైళ్లు ఆపాలని వినతిపత్రం
శ్రీకాకుళం: ఒడిస్సా రాజధాని భువనేశ్వర్‌లో శుక్రవారం జరిగిన 11వ జడ్ఆర్ యూసీసీ సమావేశానికి హాజరై, సోంపేట మండల టీడీపీ నేతలు జీఎంకు పలు వినతి పత్రాలు అందించారు. సోంపేట, బారువ రైల్వే స్టేషన్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు. పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు, పాసింజర్ రైళ్లకు బరువ రైల్వేస్టేషన్లో హాల్ట్ కల్పించాలని కోరారు.