హనీ బ్యాడ్జర్‌ను దత్తత తీసుకున్న విద్యార్థి

హనీ బ్యాడ్జర్‌ను దత్తత తీసుకున్న విద్యార్థి

HYD: హైదరాబాద్‌కు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి వన్యప్రాణుల సంరక్షణ, వాటి సంక్షేమం పట్ల గొప్ప నిబద్ధతను కనపరిచారు. హైదరాబాద్ లోని నెహ్రూ జంతు ప్రదర్శనశాలను సందర్శించి హనీ బ్యాడ్జర్‌ను ఆరు నెలలపాటు దత్తత తీసుకున్నారు. పోషించే ఖర్చుల నిమిత్తం రూ. 50 వేల చెక్కును అందజేశారు. ఈ జంతువు దత్తత మొదటిసారిగా జరిగిందని 'జూ' అధికారులు తెలిపారు.