ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే దంపతులు

ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే దంపతులు

SRPT: స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఇవాళ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నడిగూడెం మండలం స్వగ్రామం కరివిరాల సతీసమేతంగా పోలింగ్ కేంద్రానికి హాజరై తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ఓటు హక్కు ప్రతి పౌరుడి బాధ్యతని పేర్కొన్నారు. స్థానిక పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో స్థానిక సంస్థల ఎన్నికలు కీలకమన్నారు.