ఉత్తమ అవార్డులు అందుకున్న పుంగనూరు RTC డ్రైవర్లు
CTR: ప్రమాద రహిత సేవలు, ఉత్తమ పనితీరు కనబరిచిన పుంగనూరు RTC డ్రైవర్లు అవార్డులు అందుకున్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా శుక్రవారం మదనపల్లి డిపోలో సమావేశం నిర్వహించారు. పుంగనూరుకు చెందిన కరీముల్లా, అన్వర్ భాష రాష్ట్రస్థాయిలో అవార్డుకి ఎంపికయ్యారు. వీరిని RTO అశోక్ ప్రతాప్ రావు అభినందిస్తూ ప్రశంస పత్రాన్ని అందజేశారు.