పెనమలూరులో గౌత లచ్చన్న జయంతి వేడుకలు

పెనమలూరులో గౌత లచ్చన్న జయంతి వేడుకలు

కృష్ణా: పెనమలూరు మండలం పోరంకి కార్యాలయంలో స్వాతంత్య్ర సమరయోధుడు, రైతు-కార్మిక బాంధవుడు సర్దార్ గౌతు లచ్చన్న 116వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడె ప్రసాద్ శనివారం ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. గౌతు లచ్చన్న సేవలు తరతరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన పోరాటాలను గుర్తు చేశారు.