11న డయల్ యువర్ DM కార్యక్రమం

NLR: ప్రయాణికుల నుంచి సలహాలు, సూచనల కోసం నెల్లూరు డిపో-2 పరిధిలో డయల్ యువర్ డీఎం-2 కార్యక్రమాన్ని ఈనెల 11వ తేదీన నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ శివకేశవ్ యాదవ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు తమ సూచన సలహాలు అందజేసేందుకు ఈ 99592 25642 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. డిపో-2 పరిధిలో ఎక్కడైనా బస్సు సౌకర్యం లేకుంటే తమకు తెలపాలన్నారు.