బాలికను మోసం చేసిన మైనర్ బాలుడు
RR: ప్రేమ పేరుతో ఓ బాలికను మైనర్ బాలుడు మోసం చేసిన ఘటన వనస్థలిపురంలో చోటుచేసుకుంది. నల్గొండ జిల్లాకు చెందిన మైనర్ బాలుడు వనస్థలిపురంలో నివసిస్తున్న బీహార్‌కు చెందిన ఓ బాలికను ప్రేమ పేరుతో నమించి మోసం చేసినట్లు సీఐ రవిబాబు తెలిపారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, ఇవాళ కోర్టులో హాజరు పరిచారు. అనంతరం జువైనల్ హోంకి తరలించినట్లు పేర్కొన్నారు.