డైలీ వైజ్ పద్ధతిన సిబ్బంది నియామకం:DM
HNK: RTC సమ్మె నేపథ్యంలో డైలీ వైజ్ పద్ధతిన సిబ్బందిని నియమిస్తున్నామని హనుమకొండ డిపో మేనేజర్ భూక్య ధరమ్ సింగ్ తెలిపారు. డ్రైవర్ పోస్టుకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండి 18 నెలల అనుభవం కలిగిన వారికి రోజుకు రూ.1000, కండక్టర్ కోసం పదో తరగతి అర్హతతో రోజుకు రూ.800 చొప్పున దినసరిగా చెల్లిస్తామన్నారు. ఆసక్తి గలవారు నేరుగా లోకల్ డిపోలో సంప్రదించాలన్నారు.