కాంగ్రెస్ పార్టీతోనే సమన్యాయం: ఝాన్సీరెడ్డి
JN: కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని TPCC వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీరెడ్డి అన్నారు. పాలకుర్తిలో నేడు కిష్టాపురం గ్రామానికి చెందిన పలువురు నేతలు ఝాన్సీరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ రాబోయే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలన్నారు.