వరద ప్రభావ ప్రాంతాలలో కలెక్టర్ పర్యటన

వరద ప్రభావ ప్రాంతాలలో కలెక్టర్ పర్యటన

PPM: మక్కువ మండలం దుగ్గేరు, గుంటభద్ర, పనస భద్ర ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఇవాళ పర్యటించారు. పంట, ఆస్తి నష్టాలను ఆరా తీశారు. వాగులు, వంకలు స్థానికులను అడిగి తెలుసుకున్నారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వరద ప్రభావ ప్రాంతాలలో ప్రయాణించవద్దని సూచించారు. అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.