అధిక లోడుతో ఆటో ప్రయాణం.. కేసు నమోదు
SKLM: లావేరు మండలం అదపాక జాతీయ రహదారిపై అధిక మంది ప్రయాణికులతో వస్తున్న ఆటోను సీఐ అవతారం శనివారం పట్టుకున్నారు. వెంటనే ఆటో డ్రైవర్ పై కేసు నమోదు చేశారు. అనంతరం కూలీలకు అధిక లోడుతో వెళుతున్న ఆటోలు ఎక్కరాదని సూచించారు. ఇలా ప్రయాణించడం ప్రమాదమని, తద్వారా తమ కుటుంబాలు ఇబ్బందుల్లో పడతాయని సూచించారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.