RG-1 ఆధ్వర్యంలో సమ్మర్ ఫ్రీ ట్రైనింగ్ క్యాంప్
PDPL: రామగుండం సింగరేణి సంస్థ RG-1 ఆధ్వర్యంలో ఉద్యోగుల, మాజీ ఉద్యోగుల,ప్రభావిత ప్రాంతాల పిల్లలకు గోదావరిఖని స్టేడియంలో వేసవి ఉచిత శిక్షణ శిబిరం నిర్వహిస్తామని అధికార ప్రతినిధి రవీందర్ రెడ్డి తెలిపారు. ఈనెల 27-మే 21 వరకు శిబిరం కొనసాగుతుందన్నారు. ఫుట్బాల్, వాలీ బాల్, అథ్లెటిక్స్, బాస్కెట్ బాల్, స్విమ్మింగ్, బాక్సింగ్, కరాటేలో ఫ్రీ ట్రైనింగ్ ఇస్తామన్నారు.