VIDEO: యాత్రికుల మృతికి సంతాపం తెలిపిన క్రీడాకారులు

SKLM: ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో ఎమ్మెల్యే టి20 టోర్నమెంట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పహల్గామ్ ఉగ్ర దాడిలో మృతి చెందిన యాత్రికులకు క్రికెట్ క్రీడా ప్రాంగణంలో శనివారం క్రీడాకారులు సంతాపం ప్రకటిస్తూ మౌనం పాటించారు. మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తమ్మినేని గీత సాగర్, టోర్నమెంట్ నిర్వాహకులు టి.విద్యాసాగర్, సూరిబాబు పాల్గొన్నారు.