'దైవ చింతనతో మానసిక ప్రశాంతత'
NLG: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. ఆదివారం చింతపల్లి శ్రీ సాయి సన్నిధిలో 108 గరుకు స్తంభాల స్థాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ సాయిబాబా అనుగ్రహం పొందాలన్నారు. దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.