బిచ్కుంద ఆసుపత్రిలో నిర్లక్ష్యం.. కలెక్టర్ చర్యలు

బిచ్కుంద ఆసుపత్రిలో నిర్లక్ష్యం.. కలెక్టర్ చర్యలు

KMR: బిచ్కుంద ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ రోగి విషయంలో జరిగిన నిర్లక్ష్యంపై కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కఠిన చర్యలు చేపట్టారు. బాధ్యతారహితంగా వ్యవహరించిన డ్యూటీ డాక్టర్ భరత్‌ను సస్పెండ్ చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కాళిదాస్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. విధుల్లో అలసత్వం వహించిన డయాలసిస్ టెక్నీషియన్ లక్ష్మణ్ సేవలను తొలగించాలని ఆదేశించారు.