పకడ్బందీగా పని చేయాలి: ఎస్పీ

NRPT: నారాయణపేట మండలం జలాల్‌పూర్ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును శుక్రవారం ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కర్ణాటక నుంచి వరి ధాన్యం రాష్ట్రంలోకి రాకుండా కృషి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. రిజిస్టర్లను పరిశీలించి వాహనాల వివరాలు పరిశీలించారు. సిబ్బందికి భద్రతా సూచనలు ఇచ్చారు. ప్రతి వాహనాన్ని జాగ్రత్తగా తనిఖీ చేయాలన్నారు.