పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం కావాలి: కలెక్టర్
కర్నూలు: జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి ద్వారా జీడీడీపీ తలసరి ఆదాయం పెంపుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిరి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం అందించాలని అధికారులకు వివరించారు.