రామలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు

రామలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు

BHPL: గణపురం మండలం లక్ష్మారెడ్డి పల్లిలోని శ్రీ రామలింగేశ్వర సహిత అభయాంజనేయ స్వామి ఆలయం శ్రావణమాసం చివరి సోమవారం శివనామస్మరణతో కోలాహలంగా మారింది. ఈ మేరకు తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించి, అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయం ప్రత్యేక అలంకరణలతో ఆకట్టుకుంది.