'డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలి'

KNR: డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం ఐదవ వార్షికోత్సవం సందర్భంగా ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. ఇక్కడ ఎన్సీసీ కేడేట్స్, విద్యార్థులతో కలిసి మాధకద్రవ్యాలు నియంత్రణకు ప్రతిజ్ఞ చేయించారు.