మినీ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలను పరిశీలించిన ఎస్పీ

MBNR: జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో మహబూబ్‌నగర్ పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ పరిసరాలను ఎస్పీ జానకి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు లోతట్టు ప్రాంతాల వైపు వెళ్లకూడదని సూచించారు. వాగులు వంకల వైపు వెళ్లి ప్రమాదాల బారిన పడకూడదన్నారు. ఎస్పి వెంట వన్ టౌన్ సీఐ అప్పయ్య ఉన్నారు