VIDEO: జిల్లాలో 231 ఆలయాల భూముల సర్వే
కాకినాడ: జిల్లాలో దేవాదాయశాఖకు చెందిన 231 ఆలయాల భూముల సర్వే చేపట్టామని జిల్లా ఎండోమెంట్ ఆఫీసర్ కే. నాగేశ్వరరావు తెలిపారు. గురువారం కాకినాడ ధార్మిక భవన్‌లో ఆయన సమావేశం నిర్వహించారు. తూరంగి శివాలయం భూములకు సంబంధించి బహిరంగ వేలం నిర్వహిస్తామన్నారు. భూములు అన్యాక్రాంతం అయితే సంబంధిత ఈఓలపై తప్పక చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.