సూర్య నారాయణ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

శ్రీకాకుళం: రథ సప్తమి సందర్భంగా అరసవిల్లి శ్రీ సూర్య నారాయణ స్వామి వారిని నరసన్నపేట శాసన సభ్యులు ధర్మాన కృష్ణదాస్ శుక్రవారం దర్శించుకున్నారు. అసూయ దేవుడు ప్రజలందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని ప్రార్ధించారు. అధికారులు భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారని అభినందించారు. ఆయన వెంట డీసీసీబి చైర్మన్ రాజేశ్వరి, వైసీపీ నాయకులు ఉన్నారు.