ట్రాఫిక్ రూల్స్ పాటించాలి: CI రామారావు
కృష్ణా: ట్రాఫిక్ నియమాలు ఖచ్చితంగా పాటించాలని సీఐ రామారావు సూచించారు. బుధవారం ఉయ్యూరులోని AG&SG సిద్ధార్థ డిగ్రీ కాలేజ్‌లో జరిగిన స్వర్ణోత్సవం వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్ధులకు ట్రాఫిక్ రూల్స్, రోడ్డు భద్రతపై సీఐ అవగాహన సదస్సు నిర్వహించారు. బైక్ డ్రైవింగ్‌లో హెల్మెట్, కారులో సీటు బెల్ట్ ధరించాలని వివరించారు.