19న పెన్షన్/జీపీఎఫ్ అదాలత్
విశాఖపట్నంలో ఈనెల 19వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల పెన్షన్/ఏజీ జీపీఎఫ్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పెన్షన్/జీపీఎఫ్ అదాలత్ నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు సిరిపురం జంక్షన్‌లోని ఉడా చిల్డ్రన్ ఎరినాలో జరిగే ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అకౌంట్ జనరల్ శాంతి ప్రియ, డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ మోహన్ రావు పాల్గొంటారు.