ప్రభుత్వ భూమిని సర్వే చేసిన అధికారులు
MBNR: బాలానగర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయానికి గతంలో లక్ష్మారెడ్డి దానం చేసిన 4 ఎకరాలు భూమి ఆక్రమణకు గురైంది. రాజకీయ పలుకుబడితో కొందరు ఈ ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారని స్థానికులు ఇటీవల ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంగళవారం ఏడీ కిషన్‌రావు సర్వే నిర్వహించారు. తుది నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామన్నారు.