ప్రత్యేక పుష్పాలంకరణలో శ్రీ చౌడేశ్వరి అమ్మవారు
NDL: బనగానపల్లె మండలం నందవరం శ్రీ చౌడేశ్వరి దేవి బుధవారం ప్రత్యేక పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈవో శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో అర్చకులు అమ్మవారికి రుద్రాభిషేకం, మహామంగళహారతి నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు క్యూలైన్లలో వేచి ఉండి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.