'నీట్ పరీక్ష.. ఇవి తీసుకెళ్లొద్దు'

ELR: నీట్ పరీక్ష కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ వస్తువులను నిషేధించామని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ శనివారం తెలిపారు. పరీక్షలు రాసే అభ్యర్థులు సెల్‌ఫోన్, స్మార్ట్ వాచ్, బ్లూటూత్ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తమ ఇంటి వద్ద వదిలి రావాలన్నారు. పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని హెచ్చరించారు.