సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
MHBD: డోర్నకల్ మండలం అమ్మపాలెంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సర్పంచ్ కోపిల రాణి గురువారం పంపిణీ చేశారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పలువురు లబ్ధిదారులకు రూ.1,89,000 విలువైన చెక్కులను ఆమె అందజేశారు. ప్రజా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచి పేదలకు అండగా నిలిచిందని కొనియాడారు. ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని అన్నారు.