ఘనంగా కన్యకా పరమేశ్వరి జయంతి

ATP: శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. అనంతపురంలోని పాతూరు అమ్మవారిశాల, కొత్తూరు అమ్మవారిశాల, బుక్కరాయసముద్రం, నార్పల అమ్మవారిశాలలో అమ్మవారికి పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అమ్మవారి ఉత్సవ విగ్రహానికి అభిషేకం చేశారు. అభిషేకాన్ని తిలకించేందుకు అమ్మవారి భక్తులు విశేషంగా హాజరయ్యారు.