మన బాహుబలి ఇక్కడే ఉంటున్నాడు: SRH

మన బాహుబలి ఇక్కడే ఉంటున్నాడు: SRH

IPL 2026 మినీ వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ కాటేరమ్మ కొడుకు హెన్రిచ్ క్లాసెన్‌ని రిలీజ్ చేయనుందని ప్రచారం జరిగింది. అయితే SRH అలా చేయలేదు. ఈ మేరకు ‘ఆరెంజ్ ఆర్మీ.. ఊపిరి పీల్చుకోండి. మన బాహుబలి ఇక్కడే ఉంటున్నాడు’ అని ఓ స్పెషల్ వీడియో పోస్ట్ చేసింది. కాగా IPL 2025 మెగా వేలానికి ముందు SRH క్లాసెన్‌ను రూ.23 కోట్లకు రిటైన్ చేసుకుంది.