నేడు పంచాయితీ అడ్వాన్స్ ఇండెక్స్ పై శిక్షణ

ELR: నిడమర్రులోని పంచాయతీ అడ్వాన్స్ ఇండెక్స్‌పై బుధవారం శిక్షణ నిర్వహిస్తున్నట్లు MPDO జి.విజయకుమారి తెలిపారు. మంగళవారం ఆమె తన కార్యాలయంలో మాట్లాడారు. MPDO కార్యాలయం ఆవరణలో నిర్వహించనున్న ఈ శిక్షణకు ఉదయం 10 గంటలకు మండలంలోని సర్పంచ్‌లు, MPTCలు, మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.