బస్సు-బొలెరో ఢీ.. నలుగురికి గాయాలు

బస్సు-బొలెరో ఢీ.. నలుగురికి గాయాలు

సత్యసాయి: తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు-బొలెరో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో బలెరో ముందు భాగం ధ్వంసం కాగా, నలుగురు వ్యక్తులు గాయపడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న తాడిమర్రి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.